RRR: ఎన్టీఆర్, చరణ్ ల యమ స్టైలిష్ లుక్.. ఫోటోలు వైరల్!

రాజమౌళి- రాంచరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అక్టోబర్ 21 న ఈ మూవీ జపాన్ లో కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్ల కోసం చిత్ర ఆర్.ఆర్.ఆర్ టీమ్ జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో రాంచరణ్, ఎన్టీఆర్ లు సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ ఫ్యామిలీస్ తో కలిసి జపాన్ వెళ్ళారు.

రాంచరణ్ తన భార్య ఉపాసనతో, ఎన్టీఆర్ అయితే తన భార్య లక్ష్మీ ప్రణతి మరియు అతని పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి జపాన్ వెళ్ళారు. ఇక ప్రమోషన్ లలో భాగంగా వీరు అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ గ్లాసెస్ పెట్టుకుని అల్ట్రా స్టైలిష్ గా, చరణ్ కూడా గ్లాసెస్ పెట్టుకుని ఊబర్ కూల్ గా కనిపిస్తున్నారు.

దర్శకుడు రాజమౌళి కూడా హీరో మాదిరి కనిపిస్తున్నాడు. ఇక జపాన్ లో రాజమౌళి సినిమాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అక్కడి జనాలు డాన్స్ లు చేస్తూ సందడి చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దానిని బట్టి ఆర్.ఆర్ ఆర్ పై అక్కడ ఎంత క్రేజ్ ఏర్పడింది అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ కు కూడా అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ని ఎడ్వాంటేజ్ లతో ఆర్.ఆర్.ఆర్ అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus