రామ్‌చరణ్ – ఎన్టీఆర్ కలసి నటిస్తున్నారు అనేసరికి… ఇద్దరి మధ్య స్నేహం కుదిరితే బాగుండు అని చాలామంది అనుకున్నారు. కారణం ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉండీ ఉండనట్లు ఉంటుంది అనేది గత కొన్నేళ్లగా తెలుగు సినిమాను ఫాలో అయ్యేవాళ్లకు తెలుస్తుంది. దీంతో ఈ తరం హీరోల మధ్య అయినా మంచి స్నేహం ఏర్పడితే బాగుండు అనుకునేవారు. అయితే ‘ఆర్ఆర్‌ఆర్’ షూటింగ్ పూర్తయ్యాక చూస్తే ఇద్దరూ బాగా కలసిపోయారు.
మంచి స్నేహితులైపోయారు అని తెలిసింది. నిజానికి ఈ స్నేహం ఇప్పటిది కాదట. ఎప్పటి నుండో ఉందని ఈ మధ్య తెలిసింది. ఇద్దరి స్నేహం గురించి వివిధ సందర్భాల్లో తారక్, చరణ్ వివరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మార్చి 26, 27 గురించి తారక్, చరణ్ ఆసక్తికర విషయం చెప్పారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇల్లు దగ్గరదగ్గర్లోనే ఉంటాయనే విషయం తెలిసిందే. అలాగే మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు అనే విషయమూ తెలిసిందే. అయితే 26న ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి పుట్టిన రోజట.
దీంతో 26 అర్ధరాత్రి దాటాక… ఓ ఆసక్తికర విషయం జరుగుతుంటుందని అని చెప్పాడు తారక్. సరిగ్గా అర్ధరాత్రి 12 దాటగానే ఇంటి నుండి తారక్ మాయమయ్యేవాడట. ఏమైందా అని ప్రణతి ఆరా తీస్తే… ఇంకెక్కడ చరణ్ దగ్గర ఉన్నా అని చెప్పేవాడట ఎన్టీఆర్. అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? 26న అర్ధరాత్రి 12 దాటగానే రామ్‌చరణ్ కారులో వచ్చి తారక్ ఇంటి గేటు ముందు ఉండేవాడట. సమయం చూసి తారక్ వచ్చేసి కారెక్కి బయటికెళ్లి నైట్ పార్టీ చేసుకునేవారట.
ఎక్కడ ప్రణతి తిడతారేమో అని చరణ్ ‘ప్రణతి లేదు కదా అంటూ చుట్టుపక్కల చూసి తారక్‌ను కారెక్కించుకుని తీసుకెళ్లేవాడట. ఏటా మార్చి 27న ఇదే జరుగుతూ ఉంటుందని చెప్పాడు తారక్. నా పుట్టినరోజు నాడు బయటకు ఎందుకు వెళ్తున్నవావ్ అని ప్రణతి అడిగితే… రాత్రి 12 దాటిపోయింది కదా అంటే 27 వచ్చేసినట్లు… చరణ్ బర్త్‌డే కూడా వచ్చేసినట్లే అందుకే వెళ్లిపోయా అని చెప్పేవాడట ఎన్టీఆర్. ఇన్నాళ్లూ ఈ విషయాల్ని గోప్యంగా ఉంచారు అంటే పెద్ద విషయమే కదా. పోనీలెండి హీరోలు ఇలా కలసి ఉంటే హ్యాపీనే. ఫ్యాన్సే ఈ విషయం అర్థం చేసుకోవాలి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!