Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం 10లక్షల మంది ఫ్యాన్స్.. ఆలియా షాక్!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నందమూరి వారసుడిగా సీనియర్ ఎన్టీఆర్ కు తగ్గట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానుల ప్రేమను అదే తరహాలో అందుకుంటున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల నుంచి వచ్చే స్పందన మాత్రం మామూలుగా ఉండదు అని చాలాసార్లు రుజువైంది. అయితే ఇటీవల RRR సినిమా ప్రమోషన్ లో భాగంగా నార్త్ ఇండస్ట్రీ కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ అందరూ షాక్ అయ్యేలా ఒక సంచలన విషయం కూడా చెప్పాడు.

తన కోసం ఒకేసారి పది లక్షల మంది అభిమానులు వచ్చారు అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పకనే ఆలియా భట్ కూడా షాక్ అయ్యింది. RRR సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ కపిల్ శర్మ కామెడీ షో లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ షోలో తారక తన అభిమానుల ప్రేమ గురించి చాలా వివరంగా తెలియజేశాడు.

ఆంధ్రావాల సినిమా ఆడియో రిలీజ్ సమయంలో అభిమానుల కోసం అప్పుడే ప్రభుత్వం ప్రత్యేకంగా 10 రైల్లు కూడా ఏర్పాటు చేసినట్లు కపిల్ శర్మ వివరణ ఇస్తూ.. దాదాపు ఎంత మంది వచ్చి ఉంటారు అని ఒక ప్రశ్న అడిగారు. కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ ఆలోచించి దాదాపు పది లక్షల మంది అభిమానులు వచ్చి ఉంటారు అని తన జీవితంలోనే అది మరచిపోలేని ఒక మంచి మూమెంట్ అని తెలియజేశాడు.

అంతే కాకుండా ఆ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఎవరికీ కూడా చిన్న ప్రమాదం జరిగినట్లు కంప్లైంట్ కూడా రాలేదు అని తారక్ తెలియజేయడంతో ఆలియాభట్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. నేను ఇంకా పది వేల మంది వచ్చి ఉంటారు అని అనుకున్నాను అని ఆశ్చర్యంగా మాట్లాడింది. ఇక తారక్ చాలా లక్కీ అని కూడా అందరూ క్లాప్స్ కొట్టేశారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus