Mahesh Babu, Rajamouli: మహేష్ ఫ్యాన్స్ 2026 వరకు ఆగాలట.. కానీ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టడంతో ఒక్కో సినిమాకు కనీసం మూడేళ్ల సమయం పడుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి గతేడాది జులైలో విడుదల చేయాలని భావించగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజవుతోంది. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ హీరోగా తెరకెక్కనుండగా ఈ సినిమా కథ ఫైనల్ కావాల్సి ఉంది. 2022 సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

2024 సంవత్సరంలో ఈ సినిమా రిలీజవుతుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మహేష్ జక్కన్న కాంబో మూవీపై సెటైర్లు వేశారు. 2026 సంవత్సరంలో ఈ సినిమా రిలీజవుతుందని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ కామెంట్లతో అక్కడున్న వాతావరణం అంతా సరదాగా అయిపోయింది. అయితే రాజమౌళి మాత్రం తారక్ చెప్పిన రిలీజ్ డేట్ కరెక్ట్ కాదని అన్నారు. ఆ తర్వాత కరోనా, ఇతర ఇబ్బందులు లేకపోతే 2025 సంవత్సరంలో సినిమా రిలీజవుతుందని

అప్పుడు నా స్థానంలో మహేష్ ఉంటారని తారక్ కామెంట్లు చేశారు. మహేష్ సినిమా గురించి జక్కన్న మాట్లాడుతూ నాన్నగారు నాలుగైదు లైన్స్ అనుకున్నారని ప్రస్తుతం తనకు మహేష్ సినిమాపై దృష్టి పెట్టే సమయం లేదని రాజమౌళి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కొరకు మహేష్, తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని రాజమౌళి అన్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన తర్వాత సర్కారు వారి పాట సినిమాను వాయిదా వేసినందుకు మహేష్ కు కృతజ్ఞతలు అని రాజమౌళి అన్నారు.

మహేష్ జక్కన్న కాంబో మూవీ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సినిమాసినిమాకు రాజమౌళికి క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus