Jr NTR: ఎన్టీఆర్ ఎంట్రీపై ఎన్టీఆర్ ట్వీట్.. మళ్ళీ హాట్ టాపిక్ అయ్యిందిగా..!

దివంగత నందమూరి హరికృష్ణ  (Nandamuri Harikrishna)  గారి మనవడు, దివంగత నందమూరి జానకీరామ్  (Janaki Ram Nandamuri)  గారి అబ్బాయి అయినటువంటి నందమూరి తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ నుండి ఎంట్రీ 4వ తరం హీరోగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హీరోయిన్ గా కొత్త అమ్మాయి వీణ రావ్ నటిస్తుంది. వైవిఎస్ చౌదరి దర్శకుడు. గతంలో ఈయన దర్శకత్వంలో డెబ్యూ ఇచ్చిన వారంతా సక్సెస్ సాధించారు. అదే విధంగా జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ కూడా సక్సెస్ అవుతాడు అని అంతా భావిస్తున్నారు.

Jr NTR

చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టిన వైవిఎస్ చౌదరి  (Y. V. S. Chowdary)  ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని తపిస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రతి అప్డేట్ కి ఒక ప్రెస్ మీట్ పెట్టి.. వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమా గురించి కూడా మాట్లాడుకునేలా చేస్తున్నాడు. తాజాగా మరో ప్రెస్ మీట్ పెట్టి హీరో నందమూరి తారక రామారావు లుక్స్ కి సంబంధించిన మోషన్ పోస్టర్స్ ని లాంచ్ చేశాడు. ఇందులో నందమూరి తారక రామారావు లుక్స్ బాగానే ఉన్నాయి.

అందంగా ఉన్నాడు. పొడుగ్గా కూడా కనిపిస్తున్నాడు. ఇక అన్న కొడుక్కి బెస్ట్ విషెస్ చెబుతూ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ..లు ట్వీట్లు చేశారు. ఇందులో ఎన్టీఆర్ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెబుతూనే.. ‘విజయాల కోసమే కాదు అందరి ప్రేమాభిమానాలు పొందాలని’ కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే తాతయ్య నందమూరి హరికృష్ణ, నాన్న నందమూరి రామకృష్ణ ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయని, బాగా ఎదుగుతావని’ ఎన్టీఆర్ (Sr NTR) ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.

అయితే బాలకృష్ణ పేరు ప్రస్తావించకపోవడంతో నందమూరి అభిమానులు హర్ట్ అవుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీకి కూడా ఎన్టీఆర్ బెస్ట్ విషెస్ చెబుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. అయినా సరే కొందరు పనిగట్టుకుని ఎన్టీఆర్ ట్వీట్ ను కూడా తప్పుబడుతున్నారు.

అందమైన నటితో పెళ్లికి సిద్ధమైన కలర్ ఫొటో డైరెక్టర్.. ఆమె ఎవరంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus