Sandeep Raj: అందమైన నటితో పెళ్లికి సిద్ధమైన కలర్ ఫొటో డైరెక్టర్.. ఆమె ఎవరంటే..!

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో మొదట క్రేజ్ అందుకున్న సందీప్ రాజ్ (Sandeep Raj), ఆ తరువాత తొలి సినిమా కలర్ ఫోటోతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ సాధించడమే కాకుండా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. సుహాస్ (Suhas) , చాందిని చౌదరి (Chandini Chowdary) జంటగా వచ్చిన ఈ చిత్రానికి సాహిత్య రీతిలో ప్రశంసలు లభించాయి. ప్రేమ కథను ఎంతో భావోద్వేగంతో ఆవిష్కరించిన సందీప్ రాజ్, తనలోని దర్శక ప్రతిభను అందరికీ పరిచయం చేశాడు.

Sandeep Raj

ఇప్పుడు కలర్ ఫోటో (Colour Photo) ఫేమ్ సందీప్ రాజ్ వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. గత కొంత కాలంగా నటి చాందినీరావుతో (Chandni Rao) ప్రేమలో ఉన్న సందీప్, ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు. చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్స్‌లో నటిగా ప్రస్థానం ప్రారంభించింది. సందీప్ దర్శకత్వంలో వచ్చిన కలర్ ఫోటో, హెడ్స్ అండ్ టేల్స్ (Heads and Tales) వంటి ప్రాజెక్ట్‌లలో ఆమె చిన్న చిన్న పాత్రలు పోషించింది.

వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇక ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహానికి సిద్ధమవుతున్నారు. నవంబర్ 11న విశాఖపట్నంలో వీరి నిశ్చితార్థం జరగనుంది. అనంతరం డిసెంబర్ 7న తిరుపతిలో పెళ్లి వేడుక జరగనుంది. వీరి పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

త్వరలోనే అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చని సమాచారం. ఇక ప్రస్తుతం సందీప్ రాజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా ఫోకస్ చేస్తున్నారు. ప్రముఖ యాంకర్ సుమ (Suma Kanakala) కొడుకుతో మౌగ్లీ అనే సినిమా తీస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేశారు. సందీప్ రాజ్ తన కెరీర్‌లోనే కొత్త దిశగా ప్రయాణం సాగిస్తూనే, వ్యక్తిగత జీవితంలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నారు.

‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus