Jr NTR, Rajamouli: అభిమానులకు ఏం కావాలో రాజమౌళికే తెలుసు..ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!

ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తొలి రోజు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రెండో రోజు నుండీ పుంజుకుంది ఈ మూవీ. మొదటి వీకెండ్ వరకు టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్లో బాహుబలి కలెక్షన్లను అధిగమిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో కమర్షియల్ మెటీరియల్ చాలానే ఉంటుంది. రిపీట్ ఆడియెన్స్ కు స్కోప్ ఉన్న మూవీ ఇది.

Click Here To Watch NOW

రాంచరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉండడమే కాకుండా వారి అభిమానుల అంచనాలకు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేసాడు మన జక్కన్న. ముఖ్యంగా ఎన్టీఆర్- పులికి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇక ఈ సన్నివేశాల గురించి వీటిని రాజమౌళి ఆవిష్కరించిన తీరుని గురించి ఎన్టీఆర్ స్పందించాడు.

‘పులితో యాక్షన్ సీక్వెన్స్ గురించి జక్కన్న నన్ను ఓ రేంజ్లో టార్చర్ చేసాడు. తనకి రావాల్సిన ఎమోషన్ కోసం నటీనటుల పట్ల దయలేకుండా ప్రవర్తిస్తాడు రాజమౌళి. బల్గెరియా అడవుల్లో పులితో ఉన్న యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కించాడు. ‘రన్ రన్.. పులి కంటే వేగంగా పరిగెత్తాలి అంటూ రాజమౌళి ఓ జంతువులా నన్ను వెంటాడేవాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఏకంగా 65 రాత్రులు కష్టపడ్డాను. ఎంతటికీ టేక్ ఓకె అని చెప్పడు.

ఆ టైములో జక్కన్న పై కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ అభిమానులు ఈరోజు థియేటర్లలో ఆ సీన్లకి ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది జక్కన్న టార్చర్ పెట్టడం వల్లనే. అభిమానులకి ఏం కావాలో జక్కన్నకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus