Jr NTR: ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి షాకిచ్చిన తారక్‌… ఏమైందంటే!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల సందర్భంగా చిత్రబృందం ముఖ్యంగ రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వరుస టీవీ/ యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నారు. అలా బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హిందీ కమెడియన్‌ భువన్‌ బామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో చరణ్‌, తారక్‌, రాజమౌళి చాలా విషయాలకు ఆన్సర్‌లు చెప్పారు. అయితే భువన్‌ గతంలో చేసిన ఓ ఇంటర్వ్యూ గురించి తారక్‌ ప్రస్తావించి… అతన్నే ఇరుకున పెట్టడం ఆ ఇంటర్వ్యూకి హైలైట్.

Click Here To Watch Now

ఈ ఇంటర్వ్యూలో భువన్‌ కాస్త ఇరుకన పెట్టే ప్రశ్నలు వేసినా… రామ్‌చరణ్‌, తారక్‌, రాజమౌళి చాలా జాగ్రత్తగా, ఫన్నీగా సమాధానలు చెబుతూ వచ్చారు. ఎంతోమంది నటీనటులు రాజమౌళితో కలిసి పనిచేయాలనుకుంటారు. మరి, మీకు ఎవరితో వర్క్‌ చేయాలని ఉంది అని భువన్‌ అడిగితే.. నన్ను రూ.వంద కోట్ల పారితోషికం అడగకుండా ఉండే వాళ్లందరితో తప్పకుండా పని చేస్తా అని తెలివిగా చెప్పారు రాజమౌళి. ఆ మధ్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రెస్‌ మీట్‌లో మీరు చరణ్‌ను ఎందుకు గిల్లారు అని భువన్‌ అడిగాడు.

దానికి తారక్‌ రిటర్న్‌ కౌంటర్‌ వేశాడు. ఆ విషయంవదిలేయ్‌ కానీ.. ఆ మధ్య జానీ సిన్స్‌ని ఇంటర్వ్యూ చేశావు కదా ఎలా అనిపించింది అని రిటన్‌ ప్రశ్న వేశాడు. దాని భువన్‌ ఇంకా జాగ్రత్తగా అప్‌టుడేట్‌గా ఉండే మనుషులంటే నాకెంతో ఇష్టం. ఆ ఇంటర్వ్యూ బాగా అనిపించింది అని చెప్పాడు. ఆ వెంటనే భువన్‌… రాజమౌళి పని రాక్షసుడు అంటూ మీరు చాలా సార్లు చెప్పారు కదా తారక్‌… అలా ఎందుకు అని అడిగాడు. దానికి తారక్‌ ప్రతీది పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు.

ఏదైనా తను అనుకున్నట్టు పర్‌ఫెక్ట్‌గా రాకపోతే ఊరుకోరు. ఆయన నుంచి పర్‌ఫెక్షన్‌ని దూరం చేయడానికి ఎలాంటి మెడిసన్‌ లేదు. అందుకే పని రాక్షసుడు అంటుంటాను అని చెప్పాడు తారక్‌. ఇక పని రాక్షసుడు అనే ట్యాగ్‌ గురించి రాజమౌళి మాట్లాడుతూ తెలుగులో ఒక సామెత ఉంది. పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకం మొత్తం పచ్చగానే కనిపిస్తుందని. అదే విధంగా, తారక్‌ కూడా పని రాక్షసుడే. అందుకే ఆ కంటికి నేనూ రాక్షసుడిగానే కనిపిస్తున్నా అని తారక్‌కు కౌంటర్‌ వేశాడు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus