Jr NTR: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ అప్పుడేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే ఆ దర్శకులకు ఛాన్స్ ఇవ్వడానికి మిడిల్ రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు. ఉప్పెన సినిమాతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాకు ఎన్టీఆర్ మూవీ ఆఫర్ ఇచ్చినట్టు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. నాన్నకు ప్రేమతో సినిమాకు బుచ్చిబాబు సానా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కు, బుచ్చిబాబుకు పరిచయం ఏర్పడింది. అయితే ఎన్టీఆర్ తరువాత సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి టైటిల్ లేదా సినిమా తెరకెక్కుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎన్టీఆర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో సినిమా తెరకెక్కాలంటే కనీసం ఏడాది వరకు ఆగాల్సిందే.

మరి బుచ్చిబాబు ఎన్టీఆర్ కొరకు ఎదురు చూస్తారా..? లేక మరో హీరోతో ముందుకెళతారో చూడాల్సి ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కొరకు అద్భుతమైన లైన్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సలార్ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కనుంది. సలార్ సినిమా రిలీజ్ నాటికి కొరటాల శివ సినిమాను సిద్ధం చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా కోసం ఎన్టీఅర్ అభిమానులు వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus