Jr NTR: ఎప్పటి నుండో అంటున్నారు… ఇప్పుడు చేస్తారా?

ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా… ‘అదుర్స్‌’. ఎన్టీఆర్‌లోని మాస్, యాక్షన్‌, కామెడీని పర్‌ఫెక్ట్‌గా మిక్స్‌ చేసి చూపించిన చిత్రమది. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా సినిమా అభిమానులు, ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఆ రేంజిలో సినిమాతో అలరించాడు మరి తారక్‌. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమా సీక్వెల్‌ గురించి చర్చలు వినిపించాయి. ఇటీవల కాలంలో అయితే లేదు. కానీ మళ్లీ ఇప్పుడు ‘అదుర్స్‌ 2’ ముచ్చట్లు వినిపించేలా ఉన్నాయి.

Click Here To Watch NOW

దీని కారణం.. ఎన్టీఆర్‌ ఇటీవల చేసిన కామెంట్స్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారంలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అప్పుడే ‘అదుర్స్‌ 2’ సినిమా ప్రస్తావన వచ్చింది. మీ సినిమాల్లో ఓ సినిమాకి సీక్వెల్ ఉండాలి అనుకుంటే దేనికి చెయ్యాలి అనుకుంటున్నారని తారక్‌ను అడగ్గా అతను ఏ మాత్రం ఆలోచించకుండా ‘అదుర్స్’ పేరు చెప్పేశాడు. తన కెరీర్‌లో ఆ సినిమాకు మంచి స్థానం ఉంది. దాంతోపాటు తారక్‌లోని వైవిధ్యం మొత్తాన్ని ఆ సినిమా చూపించింది.

ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్, చారి పాత్ర డిక్షన్‌, చిత్రణ, బ్రహ్మానందం కామెడీ… ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు… ఇలా ఆ సినిమాలో అన్నీ అద్భుతమే అని చెప్పాలి. అందుకే తారక్‌ ఆ సినిమాకు సీక్వెల్‌ అని అన్నాడని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాకు సీక్వెల్‌ ఉండే అవకాశం ఉంది అంటూ ఆ సినిమా దర్శకుడు వీవీ వినాయక్‌ చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. కథ సిద్ధమైతే, తారక్‌తో ఆ సినిమా చేయడమే తన ఆలోచన అని కూడా చెప్పారు.

అయితే ఏమైందో ఏమో… ‘అదుర్స్‌’ సీక్వెల్‌ ఆలోచన ఇటీవల కాలంలో వినిపించడం లేదు. తారక్‌ వరుస సినిమాలతో బిజీ అవ్వడం, వినాయక్‌ వేరే సినిమాలతో ఉండటం కారణంగా ‘అదుర్స్‌’ ముచ్చట్లే లేవు. మరిప్పుడు తారక్‌ మనసులో కూడా అదుర్స్‌ సీక్వెల్‌ మేటర్‌ ఉంది కాబట్టి… మళ్లీ వినాయక్‌ ఏమన్నా ఈ విషయం గురించి ఆలోచిస్తారేమో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus