Jr NTR: సీఎం ఎన్టీఆర్ అంటూ అరుపులు, కేకలు.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ఫ్యాన్స్ లో కళ్లు చెదిరే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉందని 2009 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ లను విన్నవాళ్లు ఎవరైనా చెబుతారు. తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా 10, 15 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ దిశగా అడుగులు పడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమాలలో సైతం సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఖమ్మం జిల్లాలో తాజాగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడగా తారక్ అభిమానులు తారక్ ఫోటోలతో ఉన్న జెండాలు పట్టుకుని సందడి చేశారు. ఆ సమయంలో ఫ్యాన్స్ తో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలు సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ చేసిన నినాదాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టత ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తారక్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ కావడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాతకంలో కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని రికార్డులు క్రియేట్ చేస్తారని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు.

రాజకీయాలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుందని మరి కొందరు చెబుతున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus