Jr NTR: దేవర మూవీ ఫలితం విషయంలో ఎన్టీఆర్ టెన్షన్ కు కారణాలివేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా నటించి విడుదలవుతున్న సినిమా కావడంతో దేవరపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి. దేవర సినిమా కోసం తారక్ రెండున్నరేళ్ల సమయం కేటాయించారు. అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. దేవర రిజల్ట్ విషయంలో తారక్ టెన్షన్ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Jr NTR

ముంబైలోని ఈవెంట్ తారక్ ఒకింత నెర్వస్ గా ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ట్రైలర్లకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే దేవర ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడం కూడా తారక్ ను తెగ టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కాగా దేవర రిజల్ట్ తారక్ హిందీ సినిమాల మార్కెట్ తో పాటు భవిష్యత్తు సినిమాల బిజినెస్ ను సైతం దేవర డిసైడ్ చేయనుంది.

ఎన్నో రికార్డులను బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఎన్నో రికార్డులను క్రియేట్ చేయాల్సిన బాధ్యత తారక్ పై ఉంది. దేవర సినిమాకు ఒకింత భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందనే సంగతి తెలిసిందే. తారక్ హిందీ మార్కెట్ విషయంలో సత్తా చాటితే భవిష్యత్తు సినిమాలకు సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

దేవర ట్రైలర్ విషయంలో వస్తున్న నెగిటివిటీపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరో కావాలని సినిమాపై నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేవరతో జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. దేవర1 రిజల్ట్ దేవర2 సినిమా భవిష్యత్తును డిసైడ్ చేయనుంది. బడ్జెట్ పరంగా కూడా దేవర టాలీవుడ్ భారీ సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే.

ఆరోజు నుంచి విశ్వంభర ప్రమోషన్స్ మొదలు.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus