మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో విశ్వంభర ఒకటి. మూడు వారాల గ్యాప్ లో గేమ్ ఛేంజర్ (Game Changer) , విశ్వంభర (Vishwambhara) సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. హిట్ టాక్ వస్తే రెండు సినిమాలను థియేటర్లలో చూడటానికి మెగా ఫ్యాన్స్ సైతం సిద్ధంగా ఉన్నారు. విశ్వంభర సినిమా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది. విశ్వంభర ఆంధ్ర హక్కులు 60 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.
సీడెడ్ తో సంబంధం లేకుండానే విశ్వంభర సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మెగా ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేశారు. చిరంజీవికి (Chiranjeevi) అచ్చొచ్చిన సీజన్లలో సంక్రాంతి సీజన్ ఒకటనే సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150 (Khaidi No. 150) , వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి మంచి లాభాలను అందుకున్నాయి.
చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర టీజర్ విడుదలవుతుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. అయితే దసరా కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కానుందని ఆరోజు నుంచి విశ్వంభర ప్రమోషన్స్ మొదలుకానున్నాయని భోగట్టా. విశ్వంభర సినిమా 2025 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
విశ్వంభర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశ్వంభర సినిమా సెకండాఫ్ లో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారని చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని సమాచారం అందుతోంది.