Jr NTR: చిరంజీవి చేస్తున్న పని ఎన్టీఆర్‌ చేస్తాడా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ అయిన వెంటనే సినిమా ఉంటుంది.. అంటూ ఎన్టీఆర్ అభిమానుల్ని దర్శకుడు కొరటాల శివ ఊరించారు. అయితే ‘ఆచార్య’ ఫలితం తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. అప్పటి నుండి అదిగో, ఇదిగో అంటూ కొత్త తేదీలు వచ్చి వెళ్లిపోతున్నాయి కానీ.. సినిమా మాత్రం స్టార్ట్‌ అవ్వడం లేదు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు బాగా నిరాశకు గురవుతున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో చూస్తే అర్థమవుతుంది కూడా. ఈ విషయంలో అలా అలా ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లిందట. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌ ప్రచారం కోసం తారక్‌ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. రిటర్న్‌ వచ్చాక మంచి రోజు చూసుకుని కొరటాల శివ సినిమా స్టార్ట్‌ చేస్తారని అంటున్నారు. నవంబరు మొదటి వారాన్ని దీని కోసం ఫిక్స్‌ చేశారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడే మరో మాట బయటికొచ్చింది. అదే బుచ్చిబాబు సానా సినిమా. ‘ఉప్పెన’ సినిమా ఘన విజయం తర్వాత ఎన్టీఆర్‌తోనే నెక్స్ట్‌ సినిమా అంటూ బుచ్చిబాబు పట్టి కూర్చుని ఉన్నాడు. తారక్‌తో తనకున్న అనుబంధం నేపథ్యంలో అంత పక్కాగా ఉన్నారని టాక్‌.

అయితే, ప్రస్తుతం తారక్‌ పరిస్థితి చూస్తుంటే బుచ్చిబాబు ఇంకొన్నేళ్లు ఆగాల్సి వస్తుందని అనుకున్నారు టాలీవుడ్‌లో. కానీ తారక్‌ ఈ విషయంలో చిన్న మార్పు చేయాలని చూస్తున్నాడట. లెక్క ప్రకారం, లైనప్‌ ప్రకారం కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయాలి ఎన్టీఆర్‌. కానీ ఇప్పుడు ఆర్డర్‌ మార్చాలని చూస్తున్నాడట. కొరటాల సినిమాతోపాటు బుచ్చిబాబు సినిమా కూడా స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నాడట. అవును ఒకేసారి రెండు సినిమా సెట్స్‌ మీదకు తీసుకెళ్లే ఆలోచన ఉందట.

నేటి తరం స్టార్‌ హీరోలు ఈ పని అస్సలు చేయడం లేదు. ఓ సినిమా ఆఖరులో ఉన్నప్పుడు కూడా కొత్త సినిమా మొదలుపెట్టడం లేదు. తొలి సినిమా విడుదలై కొన్ని రోజులు అయితే కానీ కొత్త సినిమా షురూ చేయడం లేదు. చిరంజీవి మాత్రం దీనికి విరుద్ధం. మొన్నటి వరకు మూడు సినిమాలు, ఇప్పుడు రెండు సినిమాలు సెట్స్‌ మీద ఉంచారాయన. ఇప్పుడు తారక్‌ కూడా అదే పని చేయాలని చూస్తున్నాడట. దాని వల్ల అభిమానుల నిరీక్షణకు డబుల్‌ మూవీస్‌తో ట్రీట్‌ ఇవ్వొచ్చని అనుకుంటున్నాడని టాక్‌.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus