Jr NTR: ఆ షోకు గుడ్ బై చెప్పిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో గత కొన్ని వారాలుగా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారమవుతోంది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ షోకు మూడో వారం నుంచి రేటింగ్స్ అంతకంతకూ తగ్గుతున్నాయి. ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. యంగ్ టైగర్ ఎంత కష్టపడుతున్నా ఈ షో ప్రేక్షకులను మెప్పించలేదు.

మరోవైపు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో మాత్రం మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం. వీకెండ్ లో, వీక్ డేస్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ షోకు రేటింగ్స్ వస్తున్నాయి. యంగ్ టైగర్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోను ఎంచుకుని తప్పు చేశాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ తో రేటింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసిన తారక్ బుల్లితెరపై అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు.

ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తైందని దీపావళి రోజున మహేష్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ టెలీకాస్ట్ అవుతుందని సమాచారం. ఎవరు మీలో కోటీశ్వరులు షోకు తక్కువగా వస్తున్న రేటింగ్స్ విషయంలో ఒక విధంగా ఎన్టీఆర్ దే తప్పు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు సీజన్లు ప్రసారమైన ఈ షోకు ఎన్టీఆర్ ఓకే చెప్పకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షో తర్వాత సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ లేనట్టేనని తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus