NTR, Trivikram: ఆ బ్యానర్ లో నటించడం తారక్ కు ఇష్టం లేదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను చూసిన కొంతమంది ప్రేక్షకులు నిజంగా ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించారా? అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడి ఆ సినిమా ఆగిపోయింది. అటు త్రివిక్రమ్ ఇటు ఎన్టీఆర్ కారణాలు చెప్పకుండానే ఈ సినిమాను ఆపేశారు.

అదే సమయంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలామంది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఆశించడం వృథా అని కామెంట్లు చేశారు. అయితే ఈ కాంబినేషన్ దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ 32వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఒక నిర్మాత తారక్ ను కలవగా త్రివిక్రమ్ ను ఒప్పిస్తే సినిమా చేయడానికి తాను సిద్ధమేనని చెప్పినట్టు సమాచారం. ఆ నిర్మాత త్రివిక్రమ్ ను సంప్రదించగా త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత చేద్దాం అనేలా సంకేతాలను ఇచ్చారని సమాచారం. తారక్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. వాస్తవానికి తారక్ హారిక హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని భావిస్తే త్రివిక్రమ్ సైతం సినిమా చేయడానికి నో చెప్పరు.

అయితే ఆ బ్యానర్ తో జూనియర్ ఎన్టీఆర్ కు ఏమైనా సమస్య ఉందా అనే చర్చ అభిమానుల మధ్య జరుగుతోంది. ఎన్టీఆర్ స్పందిస్తే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus