Jr NTR: ఎన్టీఆర్ ప్లానింగ్ బాగానే ఉంది.. ఈ టాలెంట్ కూడా ఉంది!

ఆర్.ఆర్.ఆర్ తో ఇండియా వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీతో అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనను ప్రపంచమంతా మెచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది పూర్తయ్యాక కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇవి రెండు పూర్తయ్యాక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉండగా … ఎన్టీఆర్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించాలి అనుకుంటున్నాడు. ఇప్పటికే మహేష్, నాని వంటి హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు తీసి హిట్లు కూడా అందుకున్నారు. మహేష్ మేజర్ తో,నాని అ!, హిట్ వంటి చిత్రాలతో హిట్లు అందుకున్నారు. రవితేజ కూడా యంగ్ హీరోలతో సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. అవసరమైతే తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసి ఓటీటీ కి ఇచ్చినా మంచి లాభాలు వస్తాయి.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.ఆల్రెడీ తన కొడుకుల పేర్లతో సొంత నిర్మాణ సంస్థని స్థాపించాలని భావిస్తున్న ఎన్టీఆర్ యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ లో ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే తన సొంత నిర్మాణంలో రూపొందే చిత్రాలకి తానే కథలు రాసుకోవడం ఆ స్పెషాలిటీ. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్…సినీ పరిశ్రమలో అన్ని విభాగాల్లో పనిచేశాడు.

హీరో అవ్వని పక్షంలో లైట్ మెన్ గా అయినా ఇండస్ట్రీలో కొనసాగుదాం అనుకున్నాడు. అదే సమయంలో స్క్రిప్ట్ వర్క్ లో పనిచేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఆ అనుభవంతో కొన్ని కథలు రెడీ చేసుకున్నాడు. వాటిని ఇప్పుడు నిర్మించాలి అని భావిస్తున్నాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus