Jr NTR: తారక్ వేట్రిమారన్ కాంబినేషన్ మూవీని అలా ప్లాన్ చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటిస్తుండగా వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల బడ్జెట్ 600 కోట్ల రూపాయలు కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ రెండు సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. తారక్ మాత్రం ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ వేట్రిమారన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. తారక్ కు వేట్రిమారన్ మూడు కథలను వినిపించగా మూడు కథలలో ఒక కథకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. ఈ సినిమాను వెట్రిమారన్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని ఫస్ట్ పార్ట్ లో తారక్ సెకండ్ పార్ట్ లో ధనుష్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో వేట్రిమారన్ సమాజంలోని అసమానతలను చూపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో వేట్రిమారన్ ఒకరు కాగా ఎన్టీఆర్ వేట్రిమారన్ కాంబోలో సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ కు ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ సినిమా వల్ల తమిళంలో కూడా ఎన్టీఆర్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది.

తమిళంలో వేట్రిమారన్ కు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉండగా ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. తారక్ వేట్రిమారన్ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. తారక్ పాపులారిటీ ఉన్న దర్శకులను ఎంపిక చేసుకుంటూ తన సినిమాలకు మరింత ఎక్కువగా మార్కెట్ జరిగే విధంగా అడుగులు వేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus