Jr NTR , Vijay: తారక్ విజయ్ కాంబినేషన్ లో మూవీ అలా ఉండబోతుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దళపతి విజయ్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు సైతం ఆశిస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ విజయ్ కాంబోలో సినిమా రానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా మురుగదాస్ కొత్త సినిమాలు ప్రకటించలేదు. మురుగదాస్ గత సినిమాలు ఆశించిన రిజల్ట్ ను అందుకోకపోవడం ఫ్యాన్స్ కు షాకిచ్చింది.

అయితే తర్వాత ప్రాజెక్ట్ తో పూర్వ వైభవం రావాలని మురుగదాస్ ఫీలవుతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ విజయ్ కాంబోలో సినిమాను నిర్మించాలంటే కనీసం 500 కోట్ల రూపాయలు ఆ సినిమా కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలుపెట్టడం సులువు కాదు.

జనవరి చివరి వారం నాటికి దేవర మూవీ షూటింగ్ పూర్తి కానుంది. దేవర సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుంది. వార్2 షూటింగ్ ను పూర్తి చేసి తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించే అవకాశం ఉంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి రాబోయే రోజుల్లో ఆసక్తికర అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వరుసగా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో వేర్వేరుగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో తారక్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఊహలకు అందని బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus