Jr NTR vs Ram Charan: ఎన్టీఆర్, రాంచరణ్..ల గత 5 సినిమాల బడ్జెట్ మరియు కలెక్షన్స్ లెక్కల వివరాలు..!

తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగింది. బడ్జెట్ పరంగా కూడా..! దీంతో స్టార్ హీరోలు కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ (Jr NTR) – రాంచరణ్ (Ram Charan)..లు కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వంటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీలో కలిసి నటించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఘనవిజయం సాధించింది. అయితే ఈ హీరోల బాక్సాఫీస్ స్టామినా.. గత 5 సినిమాల నుండి ఎలా ఉంది.. అలాగే వీళ్ళ గత 5 సినిమాల బడ్జెట్ లెక్కలు ఎంత వంటి వివరాలు ఓ లుక్కేద్దాం రండి :

Jr NTR vs Ram Charan

ముందుగా ఎన్టీఆర్ గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్ లెక్కలు :

1) జనతా గ్యారేజ్ (Janatha Garage) :

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni) , వై.రవి శంకర్ (Y .Ravi Shankar) ..లు రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.153 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

2) జై లవ కుశ (Jai Lava Kusa) :

ఎన్టీఆర్ హీరోగా బాబీ (K. S. Ravindra) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) రూ.45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

3) అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava) :

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.165 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

4) ఆర్.ఆర్.ఆర్ :

ఎన్టీఆర్.. రాంచరణ్ తో కలిసి చేసిన ఈ చిత్రానికి రాజమౌళి (S. S. Rajamouli)  దర్శకుడు. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya)  రూ.550 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1387 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) దేవర (మొదటి భాగం) :

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ఇది. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.521 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

రాంచరణ్ గత 5 సినిమాల బడ్జెట్ అండ్ కలెక్షన్స్ లెక్కలు :

1) బ్రూస్ లీ- ది ఫైటర్ (Bruce Lee: The Fighter) :

రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ.62 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.60 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

2) ధృవ (Dhruva) :

రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.87 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

3) రంగస్థలం (Rangasthalam) :

రాంచరణ్ హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni) , వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు రూ.60 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.216 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

4) వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) :

రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన మాస్ మూవీ ఇది. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య రూ.65 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.94 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) ఆర్.ఆర్.ఆర్ :

రాంచరణ్..ఎన్టీఆర్..తో కలిసి చేసిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించాడు. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య రూ.550 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1387 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus