యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాకు మేకర్స్ భారీ రేంజ్ లో బిజినెస్ చేస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ సహ నిర్మాత కావడంతో ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే తాజాగా నందమూరి సుహాసిని కొడుకు హర్ష పెళ్లి గ్రాండ్ గా జరగగా ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ కంపెనీకి చెందిన ఈ వాచ్ ఖరీదు 2 కోట్ల 45 లక్షల రూపాయలు కావడం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వాచ్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేస్తారని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ వస్తువులకు బాగానే ప్రాధాన్యత ఇస్తారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలన్నీ భారీ రేంజ్ లో ఉండనున్నాయి. బాలీవుడ్ లో కెరీర్ పరంగా మరింత ఎదిగేలా తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతున్న నేపథ్యంలో తన సినిమాల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తారక్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తారక్ భావిస్తున్నారు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్