Pranthi, Upasana: ఉపాసన కోసం లక్ష్మీ ప్రణతి అంత కష్టపడ్డారా… ఏమైందంటే?

ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో వీరి భార్యలు అయినటువంటి లక్ష్మీ ప్రణతి ఉపాసన మధ్య కూడా అంతే మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇలా వీరిద్దరూ తరచూ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి కనిపించకపోయిన వ్యక్తిగతంగా తరచు కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఇలా లక్ష్మీ ప్రణతి ఉపాసన మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని చెప్పాలి.

ఇకపోతే ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని ప్రకటించినప్పటి ఈమెకు సంబంధించి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతూ వస్తుంది.తన ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటి నుంచి ఈమెకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఉపాసన స్నేహితులు తనకు నిర్వహించిన బేబీ షవర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం కడుపుతో ఉన్న ఉపాసన కోసం ఎన్టీఆర్ భార్య (Pranthi) లక్ష్మీ ప్రణతి ఎన్నో రకాల పిండి వంటలను తయారు చేసి పంపించారట. డ్రై ఫ్రూట్స్ లడ్డు సున్నుండలు వంటి పిండివంటలను స్వయంగా తయారు చేసి ఉపాసన కోసం పంపించారని తెలుస్తోంది. కడుపుతో ఉన్న మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుందో లక్ష్మీ ప్రణతికి తెలుసు అలాగే పిండి వంటలు కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఎంతో ఆరోగ్యం కావడంతో ఈమె స్వయంగా రకరకాల పిండి వంటలను తయారు చేసి ఉపాసన కోసం పంపించడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్థమవుతుంది.

ఇలా ప్రణతికి ప్రేమగా ఉపాసనకు స్వీట్స్ పంపించారని తెలిసి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి మెగా నందమూరి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus