భార్యతో కలిసి ఫస్ట్ టైం అవార్డ్ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్ , భార్గవ రామ్‌లతో కలిసి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ టీం అంతా కలిసి అమెరికాలోనే ఉంటున్నారు. తాజాగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో వీరంతా సందడి చేశారు. ‘నాటు నాటు’ పాటకు గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు స్వరవాణి ఎమ్.ఎమ్.కీరవాణి..

రాజమౌళి, కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కార్తికేయ దంపతులు, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం భార్యతో కలిసి ఓ అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్నాడు. ఇద్దరూ స్టయిలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.

బ్లాక్ సూట్‌లో తారక్, బ్లాక్ లాంగ్ గౌన్‌లో ప్రణతి కనిపించారు. వీరి పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్స్ ‘సూపర్ కపుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus