ఉమామహేశ్వరి ఇంటికెళ్లిన ఎన్టీఆర్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మూడు రోజుల క్రితం నంద‌మూరి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి తారక రామారావు గారి చిన్న కుమార్తె కంటమనేని ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది. దీంతో నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, నారా కుటుంబ స‌భ్యులు జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆమె నివాసానికి వెళ్లి ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించారు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం విదేశాల్లో ఉండడంతో తన మేనత్తని చూడటానికి వెళ్లలేకపోయారు.

దీంతో గురువారం మ‌ధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంట‌ల మధ్యలో ఉమామ‌హేశ్వ‌రి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆమె త‌ల్లి శాలిని, భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ,సోద‌రుడు క‌ళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యారు. ఇక కంటమనేని ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడికి గురవ్వడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆమె బాడీని ఉస్మానియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం చేయడం జరిగింది.

ఉమామహేశ్వరి తన రెండు కళ్ళు దానం చేశారు. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పలేదు. ఈ మధ్యనే ఆమె కూతురు పెళ్లి అయ్యింది. అప్పుడు ఆమె సంతోషంగానే కనిపించారు. కానీ ఇంతలో ఏమి జరిగింది ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేసిన సంఘటనలు ఏంటి? అన్నది చర్చనీయాంశం అయ్యింది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus