NTR,Janhvi: తారక్ జాన్వీ కపూర్ కాంబో విషయంలో ట్విస్ట్ ఇదే!

తారక్ కొరటాల శివ కాంబో సినిమాలో హీరోయిన్ కు సంబంధించి జరిగిన ప్రచారం అంతాఇంతా కాదు. అలియా భట్ నుంచి శ్రీలీల వరకు ఈ సినిమాలో తారక్ కు జోడీగా అందరు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. అయితే జాన్వీ కపూర్ ఈ సినిమాకు ఫైనల్ అయినా ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.

తారక్ మూవీ షూట్ మొదలైన సమయంలో డేట్లు కేటాయించే పరిస్థితి ఉంటే మాత్రమే ఈ సినిమాలో నటిస్తానని అలా జరగని పక్షంలో ఈ సినిమాలో నటించనని జాన్వీ కపూర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. ఒకవేళ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించకపోతే మాత్రం తారక్ కు జోడీగా రష్మిక మందన్న ఫైనల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ ఇద్దరిలో తారక్ కు జోడీగా నటించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

తారక్ ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా నుంచి షాకింగ్ అప్ డేట్ రానుందని సమాచారం అందుతోంది. కొరటాల శివ సైతం తారక్ ఇచ్చిన ఈ ఛాన్స్ ను గట్టిగా ప్రూవ్ చేసుకోవాలని నమ్ముతున్నారు. సోలో హీరోగా తారక్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

తారక్ 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ అందుకుంటుండగా కళ్యాణ్ రామ్, సుధాకర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జై లవకుశ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus