Devara: ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  కొరటాల శివ  (Koratala Siva) కాంబో మూవీ దేవర (Devara)   రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దేవర సినిమా తొలిరోజు సులువుగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. తారక్ అభిమానులు దేవర బెనిఫిట్ షోలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Devara

ప్రభాస్ (Prabhas) నటించిన పాన్ ఇండియా సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో కొన్ని రికార్డులను సెట్ చేయగా తారక్ సోలో హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తారో చూడాలి. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉండగా తారక్ మూవీ ఆ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా లేదా అనే ప్రశ్నకు సైతం ఈ నెల 27వ తేదీన సమాధానం దొరకనుంది.

శుక్రవారం రోజున ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండనుంది. దేవర (Devara) సినిమా రిజల్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా ఎంతో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండున్నర సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా తారక్ కెరీర్ లో ఏడాదికి పైగా షూట్ జరుపుకున్న తక్కువ సినిమాలలో ఈ సినిమా ఒకటి.

దేవర (Devara) సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ భవిష్యత్తును నిర్ణయించే సినిమాలలో ఒకటని చెప్పవచ్చు. దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ లకు మంచి రెస్పాన్స్ రాగా దావూదీ సాంగ్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. దావూదీ సాంగ్ కు ఇప్పటివరకు 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus