Brahmaji: నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ఒకరైన బ్రహ్మాజీ ఇప్పటికీ వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్రహ్మాజీ (Brahmaji) ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. వయస్సు పెరుగుతున్నా బ్రహ్మాజీ మాత్రం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ వరదలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

Brahmaji

ఈ వరదల వల్ల ప్రాణ నష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ఏపీ, తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి సెలబ్రిటీలు తమ వంతు విరాళం ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచారు. వరదలు వచ్చి రోజులు గడుస్తున్నా బాధితులకు తగిన సహాయం అందడం లేదంటూ వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ గురించి బ్రహ్మాజీ స్పందిస్తూ “మీరు కరెక్ట్ సార్.. వాళ్లు చెయ్యలేరు.. ఇకనుంచి మనం చేద్దాం..

ఫస్ట్ మనం 1000 కోట్ల రూపాయలు విడుదల చేద్దాం.. మన వైసీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకు ప్రజలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు..మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా” అని పోస్ట్ చేశారు. బ్రహ్మాజీ (Brahmaji) చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది. అయితే ఆ తర్వాత బ్రహ్మాజీ జగన్ పై, వైసీపీపై వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ను డిలీట్ చేయడంతో పాటు నా ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారు.

ఆ ట్వీట్ కు నాకు సంబంధం లేదు.. ఇందుకు సంబంధించి ఫిర్యాదు ఇచ్చాం ” అని అన్నారు. అయితే నెటిజన్లు మాత్రం బ్రహ్మాజీ (Brahmaji) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెబుతున్న విషయాలు ఏ మాత్రం నమ్మేలా లేవని అభిప్రాయపడుతున్నారు.

రణ్‌బీర్‌ – సాయిపల్లవి సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌.. ఎవరూ ఊహించని విధంగా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus