Devara: అక్కడ దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు.. ప్రీ సేల్స్ లో దేవర జోరు!

Ad not loaded.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ మూవీ దేవర రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ అధికారికంగా మొదలుకానున్నాయి. దేవర (Devara) సినిమా తమిళ హక్కులు 7.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయట. సాధారణంగా మన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద హిట్ అయినా కోలీవుడ్ లో మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం అరుదుగా మాత్రమే జరుగుతుంది.

Devara

కనీసం 18 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా తమిళంలో హిట్టయ్యే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాల్లో దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా ప్రీ సేల్స్ లో దేవర జోరు చూపిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాకు కొన్ని థియేటర్ల బుకింగ్స్ తోనే 70 వేల డాలర్ల కలెక్షన్లు వచ్చాయని భోగట్టా.

దేవర సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ (Anirudh Ravichander) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో తమిళనాడులో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. దేవర సినిమా కొరటాల శివకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది.

వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని కన్ఫామ్ కావడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటారనే చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరతో సరికొత్త రికార్డులు ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

మళ్ళీ కాంట్రోవర్సీ తప్పదా..బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కి ఎన్టీఆర్ డుమ్మా కొడతాడా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus