2012లో రోల్స్ రాయిస్ కారుని విదేశాల నుండీ ఇంపోర్ట్ చేయించుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. అయితే దీనికి పన్ను చెల్లించేందుకు అతను అంగీకరించలేదు. దానికి మినహాయింపు కావాలని కోర్టుని కోరాడు.8 ఏళ్ళ నుండీ ఈ కేసుకి సంబంధించిన సెషన్లు నడుస్తూనే వచ్చాయి.కొద్దిరోజుల క్రితం విజయ్ కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే అంటూ మద్రాస్ హైకోర్టుకి చెందిన సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా విజయ్ బాధ్యతగా వ్యవహరించాలని చురకలు అంటించారు.
అక్కడితో అయిపోలేదు విజయ్ లక్ష రూపాయల ఫైన్ కూడా విధించారు. ఈ తీర్పుని సవాల్ చేస్తూ విజయ్ అప్పీల్ కు వెళ్లడం జరిగింది. ఈసారి విజయ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు పై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. రూ.1 లక్ష ఫైన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఐతే, పన్ను చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది మద్రాసు హైకోర్టు .అందుకు విజయ్ కూడా ఓకే చెప్పడం విశేషం.
ఇంత సడెన్ గా విజయ్ ప్లేట్ మారుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఓ కార్ ట్యాక్స్ కోసం ఇన్నేళ్ళుగా కోర్టు మెట్లెక్కడం విజయ్ ఇమేజ్ కు ప్రమాధమే. గత రెండు,మూడు ఏళ్లుగా విజయ్ ఇమేజ్ మరింతగా పెరిగింది. రాజకీయాల్లోకి కూడా ఇతను వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగతుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకునే విజయ్ కూడా ఓ మెట్టు దిగొచ్చినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!