చిత్ర విచిత్రంగా గుత్తా జ్వాల, విష్ణు విశాల్ ల ఎంగేజ్మెంట్..!

‘రాట్ససన్’ చిత్రంతో అలరించిన విష్ణు విశాల్.. రానా చిత్రం ‘అరణ్య’ తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఈ చిత్రం విడుదల కాలేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇతను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల గుత్తా జ్వాల కూడా స్వయంగా ప్రకటించింది.

అయితే తాజాగా వీరు సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… సెప్టెంబర్ 7న(నిన్న) గుత్తా జ్వాల 37వ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. రాత్రి 12 గంటల సమయంలో విష్ణు విశాల్, జ్వాలా ఒకరినొకరు కలుసుకోవడం జరిగింది. జ్వాలాకు విషెస్ చెప్పిన కాసేపటికే…వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

వెంటనే ఉంగరాలు తెప్పించుకుని ఒకరి వేలుకి ఒకరు తొడుగుకుని నిశ్చితార్ధం చేసేసుకున్నారు. ఇంత చిత్ర విచిత్రంగా నిశ్చితార్ధం చేసుకున్నారు కదా పెళ్ళెప్పుడు చేసుకుంటారు? అని వీరిని ప్రశ్నించగా.. ‘ఇలాగే మ్యాజికల్ ఫీలింగ్ కలిగిన మరుక్షణమే వివాహం చేసేసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చినట్టు కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus