KA Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘క’!

వరుస ప్లాపులతో సతమతమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి (Kiran Abbavaram) ‘క’ (KA) సినిమా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. 2024 దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 3 సినిమాలు పోటీగా రిలీజ్ అయినప్పటికీ .. తక్కువ థియేటర్లే దొరికినప్పటికీ బాక్సాఫీస్ వద్ద చాలా బాగా కలెక్ట్ చేసింది ఈ చిత్రం. సుజీత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు.

KA Collections:

ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.25 cr
సీడెడ్ 2.75 cr
ఉత్తరాంధ్ర 3.20 cr
ఈస్ట్ 0.75 cr
వెస్ట్ 0.65 cr
గుంటూరు 1.26 cr
కృష్ణా 1.50 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.00 cr
ఓవర్సీస్ 3.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 20.06 cr

‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.20.06 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.15.56 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus