Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

దుల్కర్‌ సల్మాన్‌,భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’.సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ వంటివి బయటకు వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ లభించింది.ఇక ఈరోజు అనగా జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు కావడంతో టీజర్ ను కూడా వదిలారు.

Kaantha Teaser

‘కాంత’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 12 సెకన్ల నిడివి కలిగి ఉంది.1950..ల టైంలో మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నేపధ్యం ఉంటుందని మొదటి షాట్ తోనే క్లారిటీ ఇచ్చారు. దుల్కర్‌ సల్మాన్‌ అప్పటి కాలానికి చెందిన ఓ హీరో. భాగ్యశ్రీ బోర్సే అందులో హీరోయిన్. దర్శకుడి పాత్రలో సముద్రఖని కనిపిస్తున్నారు.

‘శాంత’ అనే పేరుతో రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్, హీరోకి మధ్య వచ్చే ఇగో క్లాష్ ప్రధానంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇందులో దుల్కర్, సముద్ర ఖని పాత్రలను బాగా ఎమోషనల్ గా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతుంది. టీజర్ చివర్లో ‘ ‘శాంత’ కాదు ‘కాంత’ అనే టైటిల్ పెట్టండి.. ఇలా పెడితేనే జనాలు చూస్తారు’ అంటూ దుల్కర్ పలికే డైలాగ్ అందరికీ కనెక్ట్ అవుతుంది. దుల్కర్ గెటప్ చూస్తే ప్రతి ఒక్కరికీ ‘మహానటి’ రోజులు గుర్తుకు వస్తాయి. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ నిజజీవితంలో ఎవరో దర్శకుడు, హీరో..ల ఆటిట్యూడ్ ను ఆధారం చేసుకుని ఈ కథ డిజైన్ చేసుకుని ఉంటాడేమో అనిపిస్తుంది. అందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సెప్టెంబర్ 12 వరకు వేచి చూడాల్సిందే. ఇక ‘కాంత’ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

భారతీయులు మర్చిపోతున్న మన మట్టి ఆట నేపథ్యంలో

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus