KP Chaudhary: డ్రగ్స్ కేసు పై ‘కబాలి’ నిర్మాత కె.పి చౌదరి సంచలన వ్యాఖ్యలు

మాదక ద్రవ్యాల విక్రయం కేసులో భాగంగా ‘కబాలి’ చిత్ర తెలుగు నిర్మాత అయిన కృష్ణ ప్రసాద్‌ చౌదరిని ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘82.75 గ్రాముల కొకైన్, కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైళ్లను’ కేపీ చౌదరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కేపీ చౌదరి మొబైల్ ఫోన్లో డ్రగ్ డీలర్లు, సెలబ్రిటీల కాంటాక్ట్స్ ఉండటంతో .. వారికి కూడా ఇతను డ్రగ్స్ సప్ప్లై చేస్తున్నాడేమో అని భావించిన పోలీసులు, రెండు రోజుల పాటు కేపీ చౌదరిని విచారించి విడుదల చేసినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఇద్దరు హీరోయిన్లతో డ్రగ్స్ గురించి (Kp Chaudhary) కేపీ చౌదరి చాట్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అయితే తాను ఏ సెలబ్రిటీకి కూడా డ్రగ్స్ సప్ప్లై చేయలేదని కేపీ చౌదరి వెల్లడించాడు. అతను ఈ విషయంపై స్పందిస్తూ.. ” నాకు డ్రగ్స్ అలవాటు ఉంది. నేను ఎక్కువగా వాటిని వాడతాను. అందుకే తెచ్చుకున్నాను. అంతేగాని నేను ఎవ్వరికీ డ్రగ్స్ విక్రయించడం లేదు.” అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఇక కృష్ణ ప్రసాద్‌ చౌదరిది ఖమ్మం జిల్లా బోనకల్‌.

బీటెక్‌ చదివి పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన ఆయన..2016 లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. రజనీకాంత్‌ హీరోగా పా రంజిత్ దర్శకత్వరలో తెరకెక్కిన ‘కబాలి’ సితెలుగు వర్షన్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణప్రసాద్‌ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు పంపిణీదారుడిగా పనిచేశారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్‌ సురవరం తదితర చిత్రాలను ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు.ఇటీవల గోవాలో ఓహెచ్‌ఎం పబ్‌ను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus