తమిళ తలైవా ‘రజనీకాంత్’ నటించిన ‘కబాలి’ సినిమా రోజుకో రికార్డ్ తో ప్రేక్షక దేవుళ్ళకు షాక్ ఇస్తుంది. ఈ సినిమా ఫర్స్ట్ లుక్, అటుపై టీజర్, ఆతరువాత ట్రైలర్, అదే క్రమంలో సినిమా మ్యూజిక్ అన్నీ పక్కన పెడితే…ఈ సినిమా రిలీజ్ కు ముందే చేస్తున్న దాదాపుగా 200కోట్ల బిజినెస్ అన్నీ కలగలపి సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. అయితే అదే క్రమంలో సినిమాని ఎలా అయిన పగడ్బంధీగా విడుదల చెయ్యాలి అని పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు నిర్మాత.
దానిలో భాగంగానే ప్రస్తుతం ఇండస్ట్రీ ని పట్టి పీడిస్తున్న ‘పైరసీ’ భూతాన్ని అరికట్టే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు నిర్మాతలు. అదే క్రమంలో కబాలి మాత్రం ఎటువంటి పైరసి తప్పులు జరుగకుండా హై కోర్ట్ కు వెళ్లి మరి క్లియరెన్స్ తీసుకువచ్చాడు నిర్మాత కళైపులి ఎస్ థాను. దాదాపు 225 ఆన్ లైన్ మూవీ సైట్స్ కు ఈ నోటీసులు పంపించారట. సో కబాలిని కేవలం థియేటర్లోనే చూడాలి ఒకవేళ ప్రైరసీ చేసినా శిక్ష గట్టిగానే పడే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు ఇండస్ట్రీ లో బలంగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా సినిమా రిలీజ్ ముందు రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో పైరసి చేయకూడదని చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడునని అన్ని ఆన్ లైన్ మూవీ సైట్స్ కు అఫిషియల్ వార్నింగ్ తో పాటుగా అన్ని సైట్స్ ను బ్లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉండడంతో….కబాలి సినిమా పగడ్బంధీగా విడుదల కానుంది. మరి అంత సెక్యూరిటీ మధ్య రానున్న కబాలి ఎలాంటి రికార్డ్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.