నట సింహా నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి లో హిందీ నటుడు కబీర్ బేడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 70 ఏళ్ళ కబీర్ 1983 లో వచ్చిన ఆక్టోపుస్సి జేమ్స్ బ్యాండ్ సినిమాలో విలన్ గా దడ పుట్టించారు. ఆ తర్వాత యాభైకి పైగా హింది సినిమాల్లో నటించి మెప్పించారు. పలు టీవీ కార్యక్రమాల్లోనూ అలరించారు. తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నారు.
కంచె సినిమా ద్వారా జాతీయ అవార్డ్ అందుకున్న డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నగౌతమి పుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో జరుగుతోంది.
ఇక్కడ కీలక మైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్లలో కబీర్ బేడి తన క్రూరమైన నటనతో బాలకృష్ణకు పోటీ ఇస్తున్నట్లు చిత్ర నిర్మాత రాజీవ్ తెలిపారు. మొరాకో షెడ్యుల్ కొన్ని రోజుల్లో పూర్తి అవుతుందని, అక్కడనుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ ఉంటుందని ఆయన చెప్పారు.