Kaikala Satyanarayana: వెంటిలేటర్ పై సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ!

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఆయన్ను అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను అపోలో వైద్యులు విడుదల చేశారు. ”సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అయ్యాయి. చికిత్సకు ఆశించినంతగా ఆయన స్పందించటం లేదు” అని వైద్యులు పేర్కొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు కైకాల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఈ మధ్యనే ఆయన ఇంట్లో కాలు జారి పడడంతో సికింద్రాబాద్ లో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించారు.

ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం తిరగబడింది. ఈసారి మాత్రం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కోరుకుందాం!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus