కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు మరణించారు. అయితే ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన నివాసంలోనే మరణించారు. ఎంతోమంది అభిమానులు సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనార్థం ఈయన పార్టీవదేహాన్ని ఫిలిం చాంబర్లో ఉంచిన విషయం మనకు తెలిసిందే. ఇక నేడు ఉదయం ఫిలిం ఛాంబర్ నుంచి కైకాల అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు కొనసాగింది.
చివరిసారిగా కైకాలను చూడటం కోసం సినీ రాజకీయ సెలబ్రిటీలు అలాగే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఇక ఈయన పెద్ద కుమారుడు హిందూ సంప్రదాయ పద్ధతిలో కైకాల అంత్యక్రియలను నిర్వహించారు. నేడు ఉదయం 11:30 నిమిషాలకు ప్రభుత్వ లాంఛనాలతో ఈయన అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలోనే పోలీసులు గౌరవ సూచకంతో గాలిలోకి కాల్పులు జరిపి ఈయనకు నివాళులు అర్పించారు. అనంతరం తన కుమారుడు ఈయనకు నిర్వహించాల్సిన కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేశారు.
ఇలా కైకాల సత్యనారాయణ సుమారు ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు. ఇక నేటితో కళామతల్లి నుంచి కైకాల పూర్తిగా సెలవు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా నిర్మాతగా ఎన్నో సేవలను అందించిన కైకాల గారి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?