సింగిల్‌గా ఉన్నప్పుడు హీరోయిన్‌గా నటించడం వేరు, పెళ్లయ్యాక హీరోయిన్‌గా చేయడం వేరు… మరి తల్లయ్యాక నటించడం అంటే ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. చిన్న బిడ్డను ఇంట్లో ఉంచి… సినిమాల్లో నటించి మెప్పించడం అంత సులభం కాదు. మన దగ్గర తక్కువ కానీ… బాలీవుడ్‌లో ఇలాంటి హీరోయిన్లు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అలాంటి వాళ్లు కనిపిస్తున్నారు. అందులో నయనతార, కాజల్ లాంటి వాళ్లు ఉన్నారు.‘భగవంత్ కేసరి’ సినిమాతో కాజల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తల్లయ్యాక ఆమె తెలుగులో నటించి, విడుదలైన చిత్రమిదే. దీంతో అబ్బాయి సంరక్షణ.. నటన, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనే ప్రశ్న ఆమె ముందుకు వచ్చింది. దానికి కాజల్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా కనిపించింది. నీల్ పుట్టాక రెండు నెలలకే ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత ‘సత్యభామ’ సినిమాలో కూడా నటించా. ఆ తర్వాతనే ‘భగవంత్ కేసరి’ కోసం రంగంలోకి దిగాను అని చెప్పింది.
మొదట్నుంచీ వ్యక్తిగత జీవితాన్నీ, వృత్తిగత జీవితాన్ని విడివిడిగా చూడటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను. నీల్ సంరక్షణ కోసం ఏర్పాట్లు చేసుకున్నాను. దాంతోపాటు ఎప్పట్లాగా నేను సినిమా షూటింగ్‌లకు వస్తే అమ్మ నాతోనే ఉంటోంది. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు వస్తున్నాయి. అయితే చేస్తున్న పనిపై ఇష్టం ఉన్నప్పుడు ఆ సవాళ్లు లెక్కలోకి రావు అని చెప్పింది. నేనే కాదు ప్రతి తల్లీ ఇలానే వృత్తినీ, పర్సనల్ లైఫ్‌నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారు అని చెప్పింది.
తల్లి అయ్యాక పాత్రల పరంగా ఏమన్నా ఆలోచనలు మార్చుకున్నారా అని అడిగితే… పెళ్లికి ముందు ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేసేదాన్ని. ఇప్పుడు అన్ని కాకుండా ప్లానింగ్ చేసుకుంటూ తక్కువ చేస్తున్నాను. ‘ఇండియన్ 2’, ‘సత్యభామ’, ‘భగవంత్ కేసరి’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాకుండా మరో కథలు ఓకే చేశాను. త్వరలో అవి అనౌన్స్ అవుతాయి అని చెప్పింది (Kajal) కాజల్.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!