కెరీర్ ప్రారంభంలో 20 లక్షల లోపు రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్లు.. ఒక్కసారి వాళ్ళకి ఫేమ్ వచ్చిందంటే మాత్రం కోటికి తగ్గరు. పొరపాటున రెండు మూడు హిట్లు పడ్డాయా రెండు కోట్ల దాకా గుంజడం మొదలెడతారు. రెమ్యూనరేషన్ సరిపోదన్నట్లు.. హీరోయిన్ల హోటల్ బిల్స్, స్టాఫ్ బిల్స్ గట్రా నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది. ఈ బిల్స్ బాధ భరించలేకే అగ్ర నిర్మాతలైతే తప్ప పెద్దగా ఎవరూ పెద్ద హీరోయిన్స్ తో సినిమాలు తీయడానికి ముందుకురావడం లేదు.
హీరోయిన్స్ కూడా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అగ్ర హీరోలతో ఎలాగూ ఆఫర్లు వస్తున్నాయి కదా అని వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం అనేది సినిమా కలెక్షన్స్ మీద భారీ ప్రభావం చూపించింది. దాంతో హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకొంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి హీరోయిన్ కూడా చేరుతున్నారు. అగ్ర కథానాయికలు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లు తమ రెమ్యూనరేషన్స్ ను సగానికి సగం తగ్గించారు.
ఇదివరకూ తమ సినిమాలకు కనీసం కోటిన్నర తీసుకొనే కాజల్ & రకుల్ ఇప్పుడు 50 నుంచి 60 లక్షలకు సినిమాలు చేసేస్తున్నారు. దాంతో ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతలకు కూడా వీళ్ళు యాక్సెసిబుల్ గా మారారు. మరి ఈ పద్ధతిని పూజా హెగ్డే కూడా ఫాలో అవుతుందో లేదో చూడాలి.
Most Recommended Video
చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!