రవితేజ సినిమా ఛాన్స్ వదులుకోవడంపై క్లారిటీ ఇచ్చిన కాజల్.!

నేటి కాలంలో ఐదేళ్లకే హీరోయిన్స్ బోర్ కొట్టేస్తున్నారు. అటువంటిది పదమూడేళ్లుగా కథానాయికగా కాజల్ చిత్రాలను చేస్తూ అలరిస్తోంది. లక్ష్మి కళ్యాణం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. గత ఏడాది లెట్స్ డు కుమ్ముడు అంటూ చిరుతో స్టెప్పులు వేసింది. తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ విజయాలను అందుకుంది. ఈ ఏడాది కూడా ఆమె బిజీగా ఉంది. తన తొలి హీరో క‌ల్యాణ్‌రామ్‌తో నటించిన ఎమ్ఎల్ఏ (మంచి ల‌క్షణాలున్న అబ్బాయి) సినిమా నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది.

ఈ సందర్భంగా తెలుగువారి చందమామ కాజల్ మీడియాతో మాట్లాడింది. అనేక సంగతులు షేర్ చేసుకుంది. అంతేకాకుండా ఈ మధ్య తనపై వచ్చిన రూమర్ ని కొట్టి పడేసింది. రవితేజ పక్కన నటిస్తే ఆ మూవీ హిట్ కావడం లేదని.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ చేయనున్న సినిమాకి నో చెప్పినట్టు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీని గురించి ఆమెను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్లే రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ మూవీ వదులుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కాజల్ క్వీన్ రీమేక్ సినిమాలో నటిస్తోంది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్  ఆమె చేతిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus