ఇండియన్ 2లో కాజల్ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయట

కాజల్ ఇంక పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడం బెటర్ అనే కంక్లూజన్స్ వస్తున్న టైమ్ లోనే “బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్” లాంటి డిజాస్టర్స్ తర్వాత కూడా కాజల్ మళ్ళీ తన స్టామినాను గట్టిగానే ప్రూవ్ చేసుకొని వరుస అవకాశాలు అందుకొంది. కానీ.. మళ్ళీ వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా.. “కవచం, సీత” చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలవడం, ఆమె నటించిన “ప్యారిస్ ప్యారిస్” ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేకపోవడంతోపాటు.. చేతిలో ఒక్కటంటే ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేకపోవడం కాజల్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. దాంతో కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎండ్ కి వచ్చింది అని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు.

తన కెరీర్ ను ఇంకొన్నాళ్లు కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా రీసెంట్ గా కన్నడ సినిమా కూడా సైన్ చేసిన కాజల్.. ఇప్పుడు నటిగా ప్రయోగాలు చేయడానికి కూడా రెడీ అవుతోంది. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న “ఇండియన్ 2″లో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో ఆమె పాత్రకు నెగిటివ్ షేడ్ ఉంటుందట. మరీ లేడీ విలన్ లా కాకపోయినా ఆమె నెగిటివ్ షేడ్ కారణంగానే కథలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. మరి కాజల్ చేస్తున్న ఈ ప్రయోగాత్మక ప్రయత్నాలు ఆమె కెరీర్ కు ఏమేరకు ఉపయోగపడతాయో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus