Kajal Aggarwal: తారక్ కోసం ఆ రూల్స్ బ్రేక్ చేశానన్న కాజల్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన బృందావనం (Brindavanam) , బాద్ షా (Baadshah) , టెంపర్ (Temper) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే కాజల్ తన సినీ కెరీర్ లో స్పెషల్ సాంగ్స్ కు దూరంగా ఉన్నారు. అయితే జనతా గ్యారేజ్ (Janatha Garage) సినిమాలో మాత్రం కాజల్ అగర్వాల్ పక్కా లోకల్ అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సాంగ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ కారణమని కాజల్ తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడించారు. ఎన్టీఆర్ సినిమా కావడం వల్లే ఆ సాంగ్ చేశానని కాజల్ క్లారిటీ ఇచ్చేశారు. ఎన్టీఆర్ కాకుండా ఎవరు అడిగినా స్పెషల్ సాంగ్ కు ఒప్పుకునేదానిని కాదని కాజల్ అగర్వాల్ పరోక్షంగా పేర్కొన్నారు. తారక్ కోసం ఐటమ్ సాంగ్స్ ను చేయకూడదనే రూల్స్ ను సైతం బ్రేక్ చేశానని కాజల్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు.

ఏళ్లు గడుస్తున్నా కాజల్ అగర్వాల్ కు క్రేజ్ తగ్గడం లేదు. కాజల్ అగర్వాల్ కు కొత్త మూవీ ఆఫర్లు సైతం వస్తున్నాయని సమాచారం అందుతోంది. సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ నా ఫోటోలు చూసి తేజ అడిషన్ కు పిలిచారని అన్నారు. తేజ అడగటంతో ఆ సినిమా అడిషన్ కోసం ఏడ్చినట్టు యాక్ట్ చేసి ఆ సినిమాకు నేను ఎంపిక కావడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

గౌతమ్ కిచ్లుతో నాకు పది సంవత్సరాల నుంచి పరిచయం ఉందని లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయిందని కాజల్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో మేము పెళ్లి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు. కాజల్ అగర్వాల్ పారితోషికం రెండు కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. కాజల్ అగర్వాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus