Kajal Aggarwal: కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ ముగ్గురేనా… ఎవరో తెలుసా?

  • July 4, 2023 / 09:55 PM IST

లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం చందమామ సినిమాతో మరొక హిట్ అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఇలా పెళ్లి జరిగిన వెంటనే (Kajal Aggarwal) కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం బాబు జన్మించిన తర్వాత కాజాల అగర్వాల్ తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాజల్ వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన కాజల్ అగర్వాల్ కు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురయింది. సమాధానం చెబుతూ తనకు ఇండస్ట్రీలో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని వారు తమన్న రకుల్ ప్రీతిసింగ్, సమంత అంటూ సమాధానం చెప్పారు.

ఈ ముగ్గురు తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడంతో వీరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి ఈ హీరోయిన్స్ అందరూ కూడా ఒకేసారి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అందరూ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్స్ అందరూ కూడా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus