Kajal: ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదిస్తోన్న స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. 2020లో ఈ బ్యూటీ తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె గర్భవతి కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని సినిమాలను పూర్తి చేసింది కానీ కొన్ని ప్రాజెక్ట్ లను మాత్రం వదులుకోవాల్సి వచ్చింది. అందులో నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమా కూడా ఉంది. రెండు, మూడు రోజులు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ.. తప్పుకోవాల్సి వచ్చింది.

Click Here To Watch

ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. అయితే గర్భవతిగా కూడా కాజల్ లక్షలు సంపాదించేస్తుంది. ఇంట్లో ఉంటూనే పలు ప్రకటనల్లో నటిస్తుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తన చెల్లెలు నిషా అగర్వాల్ కొడుకుతో కలిసి ఓ యాడ్ లో నటించింది. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ఓరియోను ప్రమోట్ చేస్తుంది కాజల్. ఈ యాడ్ లో కాజల్ బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఈ ఒక్క యాడ్ కోసం ఈ బ్యూటీ లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంది సమాచారం.

ఏది ఏమైనా.. కాజల్ ఇంట్లోనే ఉంటూ ఇలా సంపాదిస్తుండడంతో ఆమె ప్లానింగ్ మాములుగా లేదని కొందరు అంటున్నారు. ఇక ఈ యాడ్ లో కాజల్ లావుగా కనిపిస్తుందని కొందరు ట్రోల్ చేస్తుండగా.. వాటికి ధీటుగా సమాధానమిచ్చింది ఈ బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ రాసుకొచ్చింది. తెలుగులో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా రాణిస్తోంది.

పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటించింది కాజల్. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus