సెట్స్ లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్న కాజల్!

సాధారణంగా హీరో, హీరోయిన్లు తమకు పెళ్లయితే కొద్దిరోజుల పాటు గ్యాప్ తీసుకొని తమ లైఫ్ పార్ట్నర్ తో కాస్త సమయం కేటాయిస్తుంటారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం పెళ్లైన పది రోజులకే సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. ఇటీవల తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న కాజల్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడిప్పుడు ఈమె పెళ్లి తంతు నుండి కుటుంబం, బంధువులు బయటకొస్తున్నారు. కొంతమంది ఇంకా అదే మూడ్ లో ఉన్నారు.

కానీ కాజల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఎప్పుడెప్పుడు సెట్స్ లోకి అడుగు పెడదామా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిబట్టి తన పని విషయంలో కాజల్ ఎంత నిబద్దతతో ఉంటారో అర్ధమవుతోంది. పెళ్లి సందడికి తాత్కాలిక విరామాన్ని ఇచ్చి వెంటనే సెట్స్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. పెళ్లికి ముందు కాజల్ కొన్ని సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ను లైట్ తీసుకుంటే నిర్మాతలకు నష్టం కలుగుతుందని భావించిన ఆమె షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో ఈ నెల 10న షూటింగ్ పాల్గొనడానికి ఆమె ఏర్పాట్లు చేసుకున్నారు. తమిళంలో ‘హే సినామికా’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గోనున్నట్లు యూనిట్ కి కాజల్ సమాచారం అందించిందట. దీంతో చిత్రనిర్మాతలు ఆమె నిబద్ధతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus