కోలీవుడ్ లో కాజల్ కి భారీ క్రేజ్

ఇక కెరీర్ అయిపోయినట్లే అని అందరూ అంచనాలు వేస్తున్న టైమ్ లో ఒకే ఒక్క ఐటెం సాంగ్ తో ఒక్కసారి లైంలైట్ లోకి వచ్చేసింది కాజల్ అగర్వాల్. “జనతా గ్యారేజ్”లో పక్కా లోకల్ అంటూ ఎన్టీఆర్ తో చిందులేసిన కాజల్.. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతోంది. “ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి” చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న కాజల్.. “ఎం.ఎల్.ఏ”తోనూ మోడరేట్ హిట్ అందుకుంది.

33 ఏళ్ల వ‌య‌సులోనూ కుర్ర‌హీరోలు, పెద్ద హీరోలు ఆమెతో డ్యూయెట్లు పాడేందుకు పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న రెండు చిత్రాలు చేస్తోంది. తెలుగులో ఇంత బిజీగా ఉన్న టైమ్‌లోనే ఆమెకి కోలీవుడ్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. జ‌యం ర‌వి త‌మిళంలో న‌టిస్తున్న ‘తని ఒరువన్‌’ సీక్వెల్‌లో ఒక హీరోయిన్‌గా కాజ‌ల్ ఎంపికైంద‌ట‌. తని ఒరువ‌న్‌ని తెలుగులో ధృవ పేరుతో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రీమేక్ చేశారు. ఆ ఒరిజిన‌ల్ త‌మిళ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాజా. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. ఒక హీరోయిన్ కాజ‌ల్‌. ఇక త‌మిళంలో ఆమె క్వీన్ రీమేక్‌లోనూ న‌టిస్తోంది. అది విడుద‌ల‌కి సిద్దంగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus