Kajal: కాజల్ ను ఎందుకు చూపించలేదు.. త్రిష అందుకే తప్పుకుందా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కొద్దిసేపటి క్రితం ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. చిరుతో పాటు చరణ్ కూడా ఈ చిత్రంలో సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అతనికి జోడీగా పూజ హెగ్డే నటించింది. ఇక చిరు సరసన మరోసారి కాజల్ కు ఛాన్స్ దక్కింది. కానీ తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో చరణ్ సరసన నటిస్తున్న పూజ హెగ్డే కనిపించింది కానీ కాజల్ మాత్రం కనిపించలేదు.

అసలు కాజల్ ఎందుకు మిస్ అయ్యింది? అనే డౌట్ అందరిలోనూ మెదులుతుంది. ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ లో కాజల్ ను చూపించారు. టీజర్, ట్రైలర్ కు వచ్చేసరికి ఆమె మిస్ అయ్యింది. దీని పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్లు కూడా జరిగిపోతున్నాయి. ‘కాజల్ పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదని.. సినిమా కథ మొత్తం చరణ్ పాత్ర పై ఆధారపడి నడుస్తుంది కాబట్టి.. పూజ హెగ్డేని చూపించారని, కాజల్ కంటే పూజ స్క్రీన్ స్పేస్ ఎక్కువని’ నెటిజన్ల ఊహాగానాలు మొదలైపోయాయి.

నిజానికి చిరు సరసన మొదట త్రిషని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని రోజుల తర్వాత త్రిష… ‘ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంటున్నానని, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది’. అయితే ‘ఆచార్య’ టీం కవరింగ్ తర్వాత వేరేలా ఉంది అనుకోండి అది వేరే సంగతి. ముఖ్యంగా చిరు .. త్రిష ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడం పై స్పందిస్తూ..

‘త్రిష కి ఏ క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయో నాకైతే అర్ధం కావడం లేదు. నేను టీం అందరినీ అడిగాను. ఆమెకి మణిరత్నం సినిమాలో ఆఫర్ వచ్చిందని విన్నాను అందుకే ఆమె తప్పుకుని ఉంటుంది’ అంటూ వివరణ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయితేనే కానీ కాజల్ రోల్ పై ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజం అనేది తెలీవు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus