నాని సినిమాలో కాజల్, నిత్యామీనన్, రెజీనా

నేచురల్ స్టార్ గా నవరసాలు పండిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని త్వరలో మరో అవతారమెత్తబోతున్నాడు. ఇదివరకే ‘డి ఫర్ దోపిడి’ చిత్రానికి ‘ఒన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్’ అయిన నాని ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. “డైలాగ్ ఇన్ ద డార్క్” అనే షార్ట్ ఫిలిమ్ తో యావత్ సినిమా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకొన్న యువ ప్రతిభాశాలి ప్రశాంత్ చెప్పిన ఒక వైవిధ్యమైన కథ నచ్చడంతో.. అతడ్ని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తనపై వేసుకొన్నాడు నాని. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ 80% అయిపోయిందట. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను ఇవాళ సాయంత్రం 6.00 గంటలకు నాని తన ఫేస్ బుక్/ట్విట్టట్ ద్వారా విడుదల చేయనున్నాడు.

నాని ఈ సినిమాలో నటించకపోయినా.. తనకు ఇండస్ట్రీలో ఉన్న ఫేమ్ మరియు పరిచయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని.. క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్, వెరీ టాలెంటెడ్ నిత్యామీనన్, గ్లామరస్ పెర్ఫార్మర్ రెజీనా, తెలుగమ్మాయి ఈషా రెబ్బ మరియు యాక్టర్ టర్నడ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాలను సినిమాలో నటింపజేశాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ “ఆ” అని కూడా వినికిడి. అయితే.. ఇంకొద్ది గంటల్లో అఫీషియల్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఎలాగో వచ్చేస్తుందనుకోండి.
ప్రస్తుతం.. “కృష్ణార్జున యుద్ధం, ఎం.సి.ఎ” చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్న నానీ.. ఇకపై చిన్న బడ్జెట్ లో కాన్సెప్ట్ చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు. అందుకోసం తన సన్నిహితులతో కలిసి త్వరలోనే ఒక బ్యానర్ ను పెట్టే ఆలోచనలో నాని ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus