Kajal Pregnancy: కాజల్ ప్రెగ్నెంట్ అంటూ క్లారిటీ ఇచ్చేసిన గౌతమ్!

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గత ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అతనితో 7ఏళ్లకు పైగా స్నేహం చేసిన కాజల్ మొత్తానికి కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గోప్యంగానే వివాహం చేసుకుంది. అయితే ఒక వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన సినిమా కెరీర్ ను కూడా కొనసాగిస్తుంది. ఇక ఆమె ప్రెగ్నెంట్ అయినట్టు గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు కూడా వెలువడుతున్నాయి.

అయితే కాజల్ అగర్వాల్ ఆ వార్తలపై ఎప్పుడూ కూడా పెద్దగా స్పందించలేదు. ఇక మొత్తానికి ఆమె భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ఒక విషయాన్ని అయితే చెప్పకనే చెప్పేశాడు. 2022 మీ కోసం చూస్తున్నాను అంటూ.. కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్నట్లు గౌతమ్ చాలా తెలివిగా వివరణ ఇచ్చాడు. క్యాప్షన్ లోనే ప్రెగ్నెంట్ అనే ఎమోజీని కూడా పెట్టడంతో గుడ్ న్యూస్ చెప్పినట్లుగా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.

ఒక వైపు సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా కాజల్ అగర్వాల్ చాలా తొందరగానే గౌతమ్ కుటుంబానికి వారసుడిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 36 ఏళ్ల కాజల్ అగర్వాల్ 15 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోలందరితో కూడా ఆమె నటించింది. అంతేకాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా అగ్ర హీరోలతో నటించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా కాజల్ అగర్వాల్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

అయితే ఈ తరుణంలో ఆమె గర్భవతిగా ప్రకటించడంతో కొన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మెగాస్టార్ కు ఆమె జోడీగా నటించారు. ఇండియన్ టూ సినిమాలో కూడా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తమిళం ఇండస్ట్రీలో మరో రెండు సినిమాలను ఇదివరకే ఫినిష్ చేసింది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus