కొత్త ఫోటోలతో కలవరపెడుతున్న కాజల్ అగర్వాల్

Advertisement

పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా కనిపడుతుంది అంటారు. కొంపదీసి కరోనా గురించి జనాలు మరీ ఎక్కువగా బాధపడుతున్న, భయపడుతున్న కారణంగా నిన్న సాయంత్రం విడుదలైన కాజల్ ఫోటోలు అలా విచిత్రంగా, వింతగా కనిపిస్తున్నాయో లేక కాజల్ నిజంగానే పాడైపోయిందో తెలియదు కానీ.. ఆమె నయా లుక్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం బెంగ పెట్టేసుకున్నారు. నెలకి రెండుసార్లు కొత్త ఫోటోషూట్ ను తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో అప్లోడ్ చేయడం కాజల్ కి బాగా అలవాటు.

అభిమానులు కూడా ఆ ఫోటోల కోసం వెయిట్ చేస్తుంటారు తమ ఫేవరెట్ హీరోయిన్ కొత్త అందాలను చూడడం కోసం. అయితే.. నిన్న సాయంత్రం కాజల్ అప్లోడ్ చేసిన కొత్త ఫోటోలు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాయి. “సడన్ గా చూసి మంచు లక్ష్మి అనుకున్నా” అని కొందరు కామెంట్ చేస్తుంటే.. కాజల్ ఫ్యాన్స్ మాత్రం “ఏంటి కాజల్ ఇలా అయిపోయింది?” అని తెగ కంగారుపడిపోతున్నారు.

బేసిగ్గా కాజల్ కి ఏమీ కాలేదు కానీ.. ఆమె కొత్త ఫోటోషూట్ మేకప్ విషయంలో చేసిన ప్రయోగం సత్ఫలితాన్నివ్వలేదు. ఆమె రెట్రో లుక్ & ఐ బ్రోస్ షేపింగ్ సూట్ అవ్వలేదు. అందుకే అమ్మడు అలా కనిపిస్తోంది. అర్జెంట్ గా కాజల్ మరో కొత్త అందమైన ఫోటోషూట్ అప్లోడ్ చేస్తేగానీ జనాలు నెమ్మదించేలా లేరు.

1

2

3

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus